14, ఆగస్టు 2014, గురువారం

నేను ఓ పక్షినే



కొన్ని పక్షులు వేకువలో కాకుండా చీకట్లో తిరుగుతాయి
దానర్ధం వెలుతురు చూడలేక కాదు
వెలుగులో బ్రతకలేక

నేను అలాంటి ఓ చీకటి పక్షినే

వెలుగులో చావడం ఇష్టం లేదు
చీకట్లో బ్రతకడం తప్పట్లేదు

25, డిసెంబర్ 2012, మంగళవారం

కౌరవులం



ఈ రోజే తెలిసింది నా దేశం పేరు ద్రౌపతి అని 

కౌరవ వంశ సంభూతులయిన ధుర్యోధన , ధుశ్శాసనులు నా సోదరులని....

అమ్మ గాంధారి ఎందుకు కన్నావమ్మ ఇంతమంది కొడుకులని......
కంటే కన్నావు .....ఇకనైనా పారిపో......
పాలిచ్చిన రొమ్ములనే ఆశించే నీచమైన మొగజాతి మాది....

పారిపో అమ్మ ...నీతోపాటూ ఈ దేశంలో ఉన్న ద్రౌపతులందరిని తీసుకొని పారిపో .....
కుదిరితే ఈ దేశం నుంచి .....కుదరకపోతే ఈ లోకం నుంచి.........
.

30, నవంబర్ 2012, శుక్రవారం

రాగింగ్ బూతం

                                     గుండెలో మంటలు రేపింది రాగింగ్ బూతం 
                                   చుట్టూ చూస్తూ నిలుచుంది మౌన ప్రపంచం 

                                   తరాలు మారిన తొలగని ఈ క్రూర పరిచయం 
                                   ఎదురు తిరగనిదే తలవంచదు వేధింపుల పర్వం 

29, నవంబర్ 2012, గురువారం

ఒంటరి



                                   వదిలెల్లావే నన్నిలా నీ ఊహల లోకంలో 

                                   ఒంటరినైనా నేనిలా ఏమో ఏం చేయాలో 

                                  వెలివేస్తావా నువ్విలా ఈ నరకపు అంచుల్లో 
                                  ప్రాణం అంటూ ఉంటదా నీ నవ్వుల నీడల్లో 

27, నవంబర్ 2012, మంగళవారం

వందేమాతరం - అని పిలిచెను ఈ జనం......భారతమ నీకోసం

అర్థరాతిరి  ఆడది నడక కాదు స్వతంత్ర్యమంటే 
అరాచ కీచక నీచులకది ఇక రాచపు గంటే 

ఆరు పదుల ఈ ఏళ్ళు గడిచిన మారని రాతల కంటే 
రెండు నూరేళ్ళ బానిస బ్రతుకులు నయమనిపిస్తుందంతే 

మారాలి మనమని తెలియక 
ఈ దేశం తగదని నిలువక 
పరభూమికి పరిగెడుతుంటే ప్రాణం పోతుంది  

చరితల్లో మిగిలిన గెలుపుని 
రేపుకి ముడిపెట్టే జనముని 
నిలదీస్తున్న ఈ జాతిని సురాజ్యమేదండి ........

                        గనచరితలు కలిగిన దేశం గగనంలో మిగలాలా 
                        గడిచిన ప్రతి గతముని వెతికి ఈ నేటికి ఇక రాదా ....

                                                         వందేమాతరం ........వందేమాతరం......
                                                         పిలిచెను ఈ జనం ....భారతమా నీకోసం .....

                                                        వందేమాతరం ........వందేమాతరం........
                                                        వేచెను ఈ జనం .....సురాజ్యమ నీకోసం .......

1, అక్టోబర్ 2011, శనివారం

ఆకశదీవిలోని అందాల తారక- నా హారిక


ఐటెక్స్ కంపెనీ కంటబడకుండా దాగిన ఆ కల్లు
జెక్కన్న ఉలితో చెక్కినట్టి చక్కని ముక్కు
సిగ్గమ్మ ఎగబడితే ఎర్రగా మారిన చెక్కిల్లు
చెర్రి,జున్ను కలిపితే తయారైన మత్తు పదార్థం పెదాలు
చీకటి దేవత దూరినట్టు నిలిచే నల్లని కురులు
నరాల్లోకి ఎక్కించే ఎనస్తీషియా నవ్వు
నవ్వితే వెలిగే ముత్యాలు పల్లు

అడుగు దేహంలోనే దాచావు ఎన్ని అందాలు!!!!

ఎంత పుణ్యం చేసుకున్నాయొ నీ అయిదున్నర అడుగులో అణువణువు........

నా కలల సౌదాల రామచిలుక
                                          ఓ హారిక.......

అదుగుతున్న నిన్ను ఆ బ్రహ్మ కనబడక

ఎందుకచ్చావు ఈ లోకానికి
                          చస్తున్న నీ అందాలు పొగడలేక..........


NOTE:-

ప్రతి కవికి ఓ ఊహాసుందరి ఉంటుందని మా గురువుగారు చెప్తే విని
నేను ఓ ఊహ సుందరిని ఊహించుకొని రాసిన కవిత ఇది
హారిక అనేది నా ఊహసుందరి పేరు మత్రమే............

24, జనవరి 2011, సోమవారం

చీకటి

                     ఏమని వర్ణించను?
అంధుల అంధకార లోకాన్ని,
తెలుగు కవుల ఊహకు అందని చీకటిని,
                     ఏమని వర్ణించను?

వెన్నెల పుట్టినిల్లు చీకటి,
తారల ట్రంక్కుపెట్టె చీకటి,
చీకటి వెళుతూంది పగలు, చంద్రుని చేతబట్టి.

చీకటి లేకపోతే వేకువకి విలువ లేదు,
చీకటి లేకపోతే వెలుగు ఇంటికి తెరిగి వెళ్ళదు.

చీకటి లేకపోతే చిగురాకులకు నిదుర లేదు,
చీకటి లేకపోతే ఈ లొకానికే మధురం లేదు.


ముద్దుల మేఘాల పొతిల్లు చీకటి,
హద్దులు లేని అనంద సాగరం చీకటి.


కలల నదిలో వదిలే నిదురసడి చీకటి,
అలల మదిలో అలజడినాపి సేదతీర్చే సాయంత్రం చీకటి.

అలుపే తెలిసిన రాత్రి లోకాన  రారాజు చీకటి,
సకల విశ్వాన్నే ఒడిలో దాచిన కమ్మని అమ్మ చీకటి.

వెలుగుకు ప్రియ నేస్తం
చిరకాలం మనకోసం
                        చీకటి......................

                                                     --------------రాగ(రొహిత్)