బారు-బీరు
నూరు పెట్టు...........బారు పట్టు......... బీరు కొట్టు...........
ఇప్పుడున్న దునియాకి ఈ సూత్రమె ఆయువు పట్టు
ఎదుగుతున్న ప్రతి మనిషికి అదో అదనపు ఆకట్టు
అన్నీ తెలిసిన వ్యాపారికి ఇదో మంత్రపు కనికట్టు
"బీరంటే" ఉత్త నీరేనని,
"రమ్మంటే" అమ్మకానికున్న అమృతమే నమ్మమని,
"సారా" అంటే స్వర్గానికి అది దారేనని,
వివరిస్తున్న తండ్రికి తెలియదపుడు, మరో తరం ఎదురుచూపు ఆ క్షణముకని
గొంతు నిండ తడవాలన్న,మైలు రాయి దాటాలని తెలిసిన పాలకులు,
ఎంత కరుణ లేకపొతే,తెరుస్తారు బెల్టుషాపులు ఊరూరు......
సకల కష్టాల వల్లభులైన ప్రజలు,
కొంత సుఖాల వేటకై పరుగెడుతుంటే,
దారి చూపాల్సిన చేతులు,"బీరు" బాటిల్ల తొ చేయుతనిస్తూ,
ఎదురు తెరిగి అడిగే నాలుకను "స్టఫ్" పేరుతో కట్టేస్తూ,
ఆదార పడిన ప్రాణులను కష్టాల కొలిమిలో నెట్టేస్తూ,
మందు అంశ పాలనలో సమానత్వం పాటిస్తున్న పాలకులకు తెలియదపుడు,
పొరుగు దేశాల్లో కొలువు తీరిన తమ కొడుకుల "బారు బిల్లు" కట్టాలంటే "ఏ బిల్లు" పెట్టాలో............
------రాగ(రోహిత్)

anna """""xcellentttttttttttttttttttttttttttttttttttt"""""
రిప్లయితొలగించండిhands-up 2 u
thanks a lot............
రిప్లయితొలగించండి